దక్షిణాఫ్రికా × ఇండియా మ్యాచ్‌లో ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్ ఇతడే!
- ఫీల్డర్ ఆఫ్ ధి మ్యాచ్‌గా రోహిత్ ఎంపిక
- సూర్యకుమార్ యాదవ్‌పై కూడా కోచ్ దిలీప్ ప్రశంసలు
- క్రీడాకారులులే టీమిండియా బలమని వ్యాఖ్య
దక్షిణాఫ్రికాపై విజయం ఓవైపు.. కోహ్లీ వన్డే సెంచరీల రికార్డు మరోవైపు.. వెరసి నిన్న భారతీయ క్రికెట్ అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది. అయితే, అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన టీం సభ్యుడికి మ్యాచ్ అనంతరం ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఇచ్చే ఫీడ్ బ్యాక్, ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్ మెడల్ గురించి కూడా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తారు. డ్రెస్సింగ్ రూంలో కనిపించే ఈ సన్నివేశం నిత్యం వైరల్ అవుతుంటుంది.
ఈసారి ఈ మెడల్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దక్కింది. మైదానంలో తన చురుకైన ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి పరుగులకు బ్రేకులు వేసిందుకు ఈ మారు ఫీల్డింగ్ మెడల్ రోహిత్‌ను వరించింది. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ టీం సభ్యులు కమిట్మెంట్‌తో ఫీల్డింగ్ చేశారని కితాబునిచ్చాడు. మన బలం టీం సభ్యులేనని వ్యాఖ్యానించాడు. సూర్యకుమార్ కూడా అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడని చెప్పాడు.
ఈసారి వినూత్నంగా ఓ కెమెరా ద్వారా విజేతను ఎంపిక చేశారు. టీం ముందుకు వచ్చిన కెమెరా కాసేపూ అటూఇటూ తిరిగి చివరకు రోహిత్ శర్మను మెడల్‌కు ఎంపిక చేసింది. మెడల్ పొందడం అంటే కేవలం క్యాచ్‌లు పట్టడం, రన్నౌట్ చేయడం కాదని, ఆటపై ఆ క్రీడాకారుడు చూపిన ప్రభావానికి చిహ్నమని టి.దిలీప్ వ్యాఖ్యానించాడు. ఇక, దిలీప్ ఇచ్చే ఈ మెడల్ కోసం టీం సభ్యులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు.