కేసీఆర్... శివలింగం మీద తేలు లాంటి వారు: తుమ్మల
- బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు
- ఖమ్మంలో ఆసక్తికర వ్యాఖ్యలు
- కేసీఆర్ అనే తేలును ఓటు అనే ఆయుధంతో కొట్టాలని పిలుపు
బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్... శివలింగంపై తేలు వంటి వారని అభివర్ణించారు. తేలును కొడదామంటే కింద తెలంగాణ అనే లింగం ఉంటుందని అన్నారు. అందుకే కేసీఆర్ అనే తేలును ఓటు అనే ఆయుధంతోనే కొట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని సూచించారు. అహంకారానికి, ఖమ్మం ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచేలా ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో 11వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో తుమ్మల మిత్ర మండలి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తుమ్మల హాజరై ప్రసంగించారు.