కోహ్లీ బర్త్ డే వేడుకలను రద్దు చేసిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్.. ఎందుకంటే!
- స్టేడియంలో బాణసంచా పేల్చి సంబరాలకు ప్లాన్
- మ్యాచ్ అనంతరం ఫ్లడ్ లైట్ షో కోసం రిహార్సల్స్
- 70 వేల కోహ్లీ మాస్కులను సిద్ధం చేసిన క్యాబ్
- ఐసీసీ ఆమోదం తెలపకపోవడంతో వాటన్నింటినీ రద్దు చేసిన వైనం
టీమిండియా దిగ్గజ బ్యాట్స్ మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు క్రికెట్ అసోసియేషన్ ఆప్ బెంగాల్ (క్యాబ్) ఏర్పాట్లు చేసింది. పుట్టిన రోజు నాడు కోహ్లీ ఈడెన్ గార్డెన్స్ లో ఆడటంపై సంతోషం వ్యక్తం చేసింది. ఈ స్పెషల్ మ్యాచ్ కు వచ్చే కోహ్లీ అభిమానులకు 70 వేల కోహ్లీ మాస్కులు పంచాలని ప్లాన్ చేసింది. మ్యాచ్ పూర్తయ్యాక ఫ్లడ్ లైట్ షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రిహార్సల్స్ కూడా చేసినట్లు క్యాబ్ ప్రెసిడెంట్ స్నేహాశిష్ గంగూలి చెప్పారు. ఆపై భారీ ఎత్తున బాణసంచా పేల్చి కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని ప్లాన్ చేసినట్లు వివరించారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ వేడుకలకు పర్మిషన్ ఇవ్వలేదని ఆయన వివరించారు. దీంతో అనివార్యంగా ఈ ఏర్పాట్లన్నీ క్యాన్సిల్ చేస్తున్నట్లు స్నేహాశిష్ చెప్పారు. అయితే, స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులు ముక్తకంఠంతో కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతారని అన్నారు. ఏదేమైనా కోహ్లీకి ఈ పుట్టిన రోజు ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని, క్యాబ్ తరఫున కోహ్లీకి ప్రత్యేకంగా కేక్ సిద్ధం చేయిస్తున్నామని తెలిపారు.