బాలుడి ఊపిరితిత్తుల్లో దిగిపోయిన సూది.. అయస్కాంతంతో వెలికి తీసిన వైద్యులు
- ఎయిమ్స్‌లో బుధవారం 7 ఏళ్ల బాలుడికి సంక్లిష్ట ఆపరేషన్ విజయవంతం
- ఆపరేషన్ కోసం ప్రత్యేకమైన పరికరం సిద్ధం చేసిన వైద్యులు
- అయస్కాంతం జత చేసిన పరికరంతో సూది వెలికితీత
- ఎండోస్కోపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్టు వైద్యుల వెల్లడి
ఉపిరితిత్తుల్లో సూది దిగిపోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరిన ఓ బాలుడిని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు వినూత్న విధానంతో కాపాడారు. ఆయస్కాంతంతో సూదిని వెలికి తీసి చిన్నారిని రక్షించారు. బుధవారం జరిగిన ఈ ఆపరేషన్ వివరాలను వైద్యులు తాజాగా వెల్లడించారు. నాలుగు సెంటీమీటర్ల పొడవున్న సూది అతడి ఊపిరితిత్తుల్లో గుచ్చుకుపోయిందని వెల్లడించారు.
సంప్రదాయిక విధానంలో అతడికి ఆపరేషన్ క్లిష్టంగా మారే ప్రమాదం ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించినట్టు తెలిపారు. ఈ క్రమంలో అప్పటికప్పుడు ఓ ప్రత్యేక పరికరాన్ని సిద్ధం చేసినట్టు తెలిపారు. మార్కెట్ నుంచి ఓ అయస్కాంతం తెప్పించి ఆ పరికరానికి అమర్చామన్నారు. దాని ద్వారా అయస్కాంతాన్ని సూది ఉన్న భాగం సమీపానికి చొప్పించి సూదిని బయటకు రప్పించినట్టు వివరించారు. ఈ ప్రయోగం ఫలితం ఇస్తుందా? లేదా? అన్న విషయంలో తమకే మొదట్లో సందేహం కలిగిందన్నారు. కానీ, ఆశ్చర్యకరంగా ఆయస్కాంత ప్రభావంతో సూది దానంతట అదే బయటకు వచ్చిందని వివరించారు. ఎండోస్కోపీ ద్వారా ఈ మొత్తం ప్రక్రియను నిర్వహించినట్టు పేర్కొన్నారు.
ఈ ప్రయోగం ఫలించి ఉండకపోతే బాలుడి ఛాతిని తెరిచి సూది వెలికితీయాల్సి వచ్చేదని వైద్యులు తెలిపారు. అయితే, బాలుడికి అసలేం జరిగిందో కుటుంబసభ్యులు చెప్పలేకపోయారని వారు పేర్కొన్నారు.