స్వగ్రామంలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఓటు పునరుద్ధరణ

  • దుగ్గిరాల ఓటర్ల జాబితాలోనే మాజీ ఎన్నికల కమిషనర్‌కు ఓటు
  • స్థానికంగా ఉండట్లేదంటూ గతంలో జాబితాలో దక్కని చోటు
  • న్యాయపోరాటం ఫలించడంతో జాబితాలో మళ్లీ పేరు చేర్పు
మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఎట్టకేలకు తన స్వగ్రామం దుగ్గిరాలలో ఓటు లభించింది. కోర్టు ఆదేశాల అనుసారం అధికారులు ఆయన పేరును ఓటర్ల జాబితాలో చేర్చారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానికంగా ఉండట్లేదంటూ స్థానిక ఎన్నికల ముందు ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో ఆయన స్వగ్రామంలోనే తనకు ఓటు హక్కు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దుగ్గిరాలలోనే ఇల్లు, ఆస్తులు ఉన్నాయని, తన తల్లి లక్ష్మి కూడా అదే గ్రామంలో ఉంటున్నారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కోర్టు ఆయనకు అర్హతలుంటే అదే గ్రామంలో ఓటు హక్కు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేరు జాబితాలో చేరింది.


More Telugu News