​వోక్స్ కు 4 వికెట్లు... ఆసీస్ 286 ఆలౌట్

  • వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా × ఇంగ్లండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 49.3 ఓవర్లలో ముగిసిన ఆసీస్ ఇన్నింగ్స్
  • రాణించిన లబుషేన్, స్మిత్, గ్రీన్, స్టొయినిస్, జంపా
వరల్డ్ కప్ లో ఇవాళ్టి రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఆసీస్ జట్టులో మార్నస్ లబుషేన్ 71 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (15), ట్రావిస్ హెడ్ (11) విఫలం కాగా... స్టీవ్ స్మిత్ (44), కామెరాన్ గ్రీన్ (47), మార్కస్ స్టొయినిస్ (35), ఆడమ్ జంపా (29) రాణించారు.

ఓ దశలో ఆసీస్ 247 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు ఇన్నింగ్స్ ముగియడానికి మరెంతో సమయం పట్టదనిపించింది. అయితే, జంపా కాస్త దూకుడుగా ఆడడంతో ఓ మోస్తరు భారీ స్కోరు వచ్చింది. కెప్టెన్ పాట్ కమిన్స్ 10, స్టార్క్ 10 పరుగులు చేసి చివర్లో తమవంతు సహకారం అందించారు. 

ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ ఓపెనర్లు వికెట్లు వోక్స్ ఖాతాలోకే చేరాయి. అదిల్ రషీద్, మార్క్ ఉడ్ 2, డేవిడ్ విల్లీ 1, లివింగ్ స్టన్ 1 వికెట్ తీశారు.


More Telugu News