బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదు: అనురాగ్ ఠాకూర్
- కేసీఆర్ చివరకు నిరుద్యోగులను కూడా మోసగించారన్న అనురాగ్ ఠాకూర్
- కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద ఇంజినీరింగ్ తప్పిదమని విమర్శ
- ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ విదేశాల నుంచి డబ్బు తెప్పిస్తోందని ఆరోపణ
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకు ఎంతో మేలు చేస్తారని భావించామని.... కానీ ఆయన చివరకు నిరుద్యోగులను కూడా మోసం చేశారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. టీఆర్ఎస్ పేరును మార్చి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అతిపెద్ద ఇంజినీరింగ్ తప్పిదమని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎప్పటికీ ఒక్కటి కావని చెప్పారు.
రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో దోచుకుందని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని... ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బులను తెప్పిస్తోందని విమర్శించారు. మహాదేవ్ యాప్ పేరుతో ఆ పార్టీ అవకతవకలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలంగాణను ఇవ్వడంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్ల ఎంతో మంది చనిపోయారని అన్నారు. వరల్డ్ కప్ లో ఇండియా అద్భుతంగా ఆడుతోందని... తనను కూడా తెలంగాణ ఎన్నికల సందర్భంగా తమ అధిష్ఠానం బ్యాట్స్ మెన్ గా పంపించిందని చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.