పురందేశ్వరిపై విజయసాయి చేసింది వ్యక్తిగత దూషణలు: ఆదినారాయణరెడ్డి
- పురందేశ్వరిపై విజయసాయి వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆదినారాయణరెడ్డి
- పురందేశ్వరి వాస్తవాలు లేవనెత్తుతున్నారని వెల్లడి
- విజయసాయి తీరు సరికాదని హితవు
గత కొన్నిరోజులుగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అదే స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి తప్పుబట్టారు.
పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణల కిందకు వస్తాయని అన్నారు. పురందేశ్వరి వాస్తవాలు లేవనెత్తుతున్నారని, కానీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరికాదని హితవు పలికారు.
ఏపీలో ఇసుక, మద్యం మాఫియా నడవడంలేదా? ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తున్నది నిజం కాదా? పార్లమెంటు సాక్షిగా బీజేపీకి వైసీపీ మద్దతు ఇవ్వలేదా? జగన్, భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ముద్దాయిలు కాక మరెవ్వరు? అంటూ ఆదినారాయణరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పురందేశ్వరిపై వ్యాఖ్యలు చేసే హక్కు విజయసాయిరెడ్డికి లేదని స్పష్టం చేశారు. విజయసాయి విశాఖలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.