పాకిస్థాన్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న న్యూజిలాండ్.. భారీ స్కోరు దిశగా కివీస్

  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
  • సెంచరీతో విరుచుకు పడిన రచిన్ రవీంద్ర
  • కివీస్ స్కోరు.. 43 ఓవర్లలో 337/4
వన్డే ప్రపంచకప్ లో భాగంగా బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్ లో పాక్ బౌలర్లకు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తమ నిర్ణయం ఎంత తప్పో నిమిషాల వ్యవధిలోనే వారికి అర్థమయింది. కివీస్ ఓపెనర్లు కాన్వాయ్, రచిన్ రవీంద్రలు 10.5 ఓవర్లలో 68 పరుగులు జోడించారు. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కాన్వాయ్ అవుటైన తర్వాత కేన్ విలియంసన్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత రవీంద్ర, విలియమ్స్ ధాటికి బౌండరీ లైన్ చిన్నబోయింది. 

ఈ క్రమంలో రవీంద్ర 94 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విలియంసన్ 95 పరుగుల వద్ద ఔటై శతకాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం రవీంద్ర 108 వ్యక్తిగత పరుగుల వద్ద బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ఆ తర్వాత మిషెల్ కూడా దూకుడుగా 29 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం చాప్ మన్ (29), ఫిలిప్స్ (12) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 337 పరుగులు. కివీస్ దూకుడు చూస్తుంటే భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


More Telugu News