కోనాయిపల్లి ఆలయంలో సీఎం కేసీఆర్ పూజలు
- నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయించిన సీఎం
- ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ దాఖలు
- ఆనవాయతీగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. ప్రతి ఎన్నికలకు ముందు కోనాయిపల్లిలో పూజలు నిర్వహించడం కేసీఆర్ ఆనవాయతీ. ఈ సారి కూడా దీనిని కొనసాగిస్తూ శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గంలో గుడికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
ఆయన వెంట మంత్రి హరీశ్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలు, అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం కేసీఆర్ ను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారి శేష వస్త్రాలతో పాటు, తీర్థ ప్రసాదాలను అందించారు. కాగా, ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న ఉదయం గజ్వేల్ లో, మధ్యాహ్నం కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారని బీఆర్ఎస్ వర్గాల సమాచారం.