ఏందయ్యా ఇది! సచిన్ విగ్రహంలో సచిన్ ఏడీ?.. ఆడేసుకుంటున్న అభిమానులు!
- ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహం
- టెండూల్కర్ విగ్రహంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్మిత్ ఛాయలు
- మీమ్స్‌తో విరుచుకుపడుతున్న అభిమానులు
- సెటైరికల్ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్న వైనం
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇటీవల ఏర్పాటు చేసిన టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ విగ్రహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో మీమ్స్‌తో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్ట్రెయిట్ డ్రైవ్ ఆడుతున్నట్టున్న ఈ విగ్రహాన్ని చూసి అభిమానులు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
దీనికి కారణం ఆ విగ్రహంలో సచిన్ పోలికలకు బదులు ఆసీస్ పరుగుల యంత్రం స్టీవ్‌స్మిత్ పోలికలు ఉండడమే. దీనిని గుర్తించిన అభిమానులు హనుమంతుడిని చేయబోతే కోతి అయినట్టుగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని షేర్ చేస్తూ సచిన్ అభిమానులు ఆడేసుకుంటున్నారు. వాంఖడేలో స్మిత్ విగ్రహం పెట్టినందుకు ప్రతిగా మెల్‌బోర్న్‌లో సచిన్ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ సెటైర్లు వేస్తున్నారు.