వరల్డ్ కప్ నుంచి హార్ధిక్ పాండ్యా పూర్తిగా ఔట్.. అనూహ్యంగా యువ బౌలర్‌కు చోటు
- టోర్నీ నుంచి పాండ్యా పూర్తిగా నిష్ర్కమించినట్టు ఐసీసీ ప్రకటన
- హార్ధిక్ స్థానంలో యువ పేసర్ ప్రసిధ్ కృష్ణకు చోటు
- టోర్నమెంట్ ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదం
ప్రపంచ కప్ 2023లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియాకి బిగ్ షాక్ తగిలింది. చీలమండ గాయం నుంచి త్వరగా కోలుకొని నాకౌట్ మ్యాచ్‌లకైనా అందుబాటులోకి వస్తాడనుకున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా టోర్నీ నుంచి పూర్తిగా నిష్ర్కమించాడు. గాయం కారణంగా వరల్డ్ కప్ను నుంచి పూర్తిగా దూరమైనట్టు ఐసీసీ ప్రకటించింది. చీలమండ గాయం నుంచి పాండ్యా ఇంకా కోలుకోలేదని, ప్రపంచ కప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నట్టు వెల్లడించింది. కాగా పూణె వేదికగా బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ హార్ధిక్ పాండ్యా గాయపడ్డాడు. ఎడమ చీలమండకు గాయమైంది, ఓవర్ ముగించకుండానే పాండ్యా బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి మైదానంలోకి రాలేదు. అయితే పాండ్యా ఎప్పటికి కోలుకుంటాడనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు.
పాండ్యా స్థానంలో ప్రసిధ్ కృష్ణకు చోటు
అనూహ్యంగా టోర్నీకి దూరమైన హార్ధిక్ పాండ్యా స్థానంలో యువపేసర్ ప్రసిధ్ కృష్ణకు చోటుదక్కింది. ఈ మేరకు టోర్నమెంట్ ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఇందుకు ఆమోదం తెలిపిందని ఐసీసీ తెలిపింది. కాగా ప్రసిధ్ కృష్ణకు కేవలం 19 వన్డే మ్యాచ్‌లు ఆడిన అనుభవం మాత్రమే ఉంది. ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. కాగా తుది జట్టులో స్థానం కోసం అదిరిపోయే ఫామ్‌లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌తో ప్రసిధ్ కృష్ణ పోటీ పడాల్సి ఉంటుంది. ఇదిలావుండగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు ప్రసిధ్ కృష్ణ జట్టుతో కలవనున్నాడు.