అక్రమ మార్గాలలో ప్రవేశం.. అమెరికాలో ఏడాది వ్యవధిలో 97 వేలమంది భారతీయుల అరెస్ట్
- అనుమతులు లేకుండా ప్రవేశించడమే కారణం
- మెక్సికో సరిహద్దులో 40 వేల మంది, కెనడా సరిహద్దులో 30 వేల మంది అదుపులోకి
- ప్రకటించిన అమెరికా కస్టమ్స్-బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం
అమెరికా కలలను నెరవేర్చుకోవడానికి కొందరు అక్రమమార్గాలను ఆశ్రయిస్తున్నారు. అడ్డదారిన అగ్రరాజ్యం వెళ్లి పట్టుబడుతూ కటకటాలపాలవుతున్నారు. ఈ జాబితాలో భారతీయుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఏడాది వ్యవధిలోనే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన 97 వేల మంది భారతీయులు అరెస్టయ్యారు. ఈ విషయాన్ని అమెరికా కస్టమ్స్-బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ప్రకటించింది. అమెరికాకు అక్రమ వలసలపై గురువారం సెనేట్‌లో కీలకమైన చర్చ జరిగింది. మెక్సికోలో అక్రమ వలసలకు సాయం చేయడం వ్యాపారంగా మారిందని, డ్రగ్స్ అక్రమ రవాణా మూఠాలు వలసదారులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయని సెనేటర్ జేమ్స్ లాంక్‌ఫోర్డ్ ఆరోపించారు. ఒకవేళ పట్టుబడితే ఎలా తప్పించుకోవాలో, అధికారులకు ఏం సమాధానం చెప్పాలో కూడా శిక్షణ ఇస్తున్నారని అన్నారు. స్వదేశంలో భయానక పరిస్థితుల కారణంగా ఆశ్రయం కోసం వచ్చామని చెప్పాలని శిక్షణ ఇస్తున్నారని చర్చలో భాగంగా పేర్కొన్నారు.
కాగా యూఎస్‌ఏ చేరడానికి ఇండియన్స్ అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారని అమెరికా కస్టమ్స్-బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం హెచ్చరించింది. గతేడాది అక్టోబరు నుంచి ఈ సంవత్సరం సెప్టెంబరు వరకు మొత్తం 96,917 మంది భారతీయులను అరెస్టు చేసినట్టు అమెరికా కస్టమ్స్-బోర్డర్ ప్రొటెక్షన్ తన ప్రకటనలో పేర్కొంది. వీరిలో అత్యధికంగా 40 వేల మంది మెక్సికో సరిహద్దులో, 30 వేల మంది కెనడా సరిహద్దులో పట్టుబడ్డారని వెల్లడించింది.