ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం... కీలక నిర్ణయాలు ఇవిగో!
- సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం
- 4 గంటలకు పైగా సాగిన భేటీ
- రాష్ట్రంలో సమగ్ర కులగణనకు క్యాబినెట్ నిర్ణయం
- టెన్నిస్ ఆటగాడు సాకేత్ మైనేనికి గ్రూప్-1 ఉద్యోగం
సీఎం జగన్ అధ్యక్షతన సుదీర్ఘ సమయం పాటు జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ మంత్రివర్గ భేటీ 4 గంటలకు పైగా సాగింది. ఏపీ సచివాలయం మొదటి బ్లాక్ లో ఈ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధానంగా ఏపీలో సమగ్ర కులగణనపై ఈ సమావేశంలో చర్చించారు. కులగణన చేపట్టేందుకు సీఎం సహా మంత్రులందరూ సానుకూలంగా స్పందించారు. నవంబరు 15 నుంచి రాష్ట్రంలో కులగణన చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాదు, టెన్నిస్ ఆటగాడు సాకేత్ మైనేనికి గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
క్యాబినెట్ భేటీలో ఇంకా ఏ నిర్ణయాలు తీసుకున్నారంటే...

- ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ. ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం.
- ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్డర్ డ్రాఫ్ట్-2023కు ఆమోదం
- జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆమోదం. నవంబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమం
- ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్ లో 467 ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ
- 6,790 పాఠశాలల్లో భవిష్యత్ నైపుణ్యాలపై బోధన
- ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలకు విద్యుత్ చార్జీల మినహాయింపు
- వ్యవసాయ సహకార శాఖకు రూ.5 వేల కోట్లకు గ్యారెంటీతో మార్క్ ఫెడ్ ద్వారా రుణం
- పోలవరం నిర్వాసితుల ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్లకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుం, యూజర్ చార్జీల మినహాయింపు నిర్ణయాన్ని ర్యాటిఫై చేసిన ప్రభుత్వం.