టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానాన్ని ఆపిన మహిళ.. వీడియో వైరల్
- ఎయిర్‌పోర్టు టార్మాక్‌పై పరిగెత్తిన మహిళ
- విమానాన్ని ఆపే ప్రయత్నంలో చక్రాల వద్దకు కూడా వెళ్లిన వైనం
- పైలట్ గుర్తించి ఇంజిన్ ఆపడంతో తప్పిన ప్రమాదం
బస్సు లేదా కారు బయలుదేరి వెళ్లిపోతుంటే ఆపండీ.. అంటూ చేతులు ఊపుతూ ఆపుతాం. మరి టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న విమానాన్ని ఆపిన ఘటనలను చాలా అరుదుగా చూస్తుంటాం. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా నుంచి ఆడిలైట్ వెళ్లాల్సిన ఓ మహిళ నిర్వాకం కారణంగా చివరి క్షణంలో ఆపాల్సి వచ్చింది.
ఆలస్యంగా వచ్చిన నిందిత మహిళ విమానాన్ని అందుకునేందుకు విమానాశ్రయం టార్మాక్‌పైకి పరిగెత్తింది. టేకాఫ్‌కు రెడీ అవుతున్న సమయంలో పైలెట్‌కి కనిపించేలా విమానం చుట్టూ సదరు మహిళ తిరుగాడింది. సెక్యూరిటీ కళ్లుగప్పి ఆమె విమానం దగ్గరకు చేరుకుంది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను ఆశ్చర్యపరిచిన ఈ దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన నిందితురాలిని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై 2 కేసులు నమోదు చేశారు. సెక్యూరిటీ జోన్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం, కొద్ది పరిణామంలో గంజాయిని కలిగివుందని అభియోగాలు మోపారు. కాగా ఇది విచిత్రమైన ఘటన అని ప్రత్యక్ష సాక్షి సైమన్ హేల్స్ పేర్కొన్నారు. అక్షరాలా ముందు చక్రం పక్కన, ముందుభాగం కింద ఆమె నిలబడిందని, అదృష్టవశాత్తూ పైలట్ గుర్తించి ఇంజిన్‌ను ఆపాడని లేదంటే ఘోరం జరిగిపోయి ఉండేదని అన్నారు.