గాజాను చుట్టుముట్టేసిన ఇజ్రాయెల్.. సైనికుల శవాల్ని మూటల్లో పంపిస్తామన్న హమాస్
- గాజా ముఖ్య పట్టణంలోకి ఇజ్రాయెల్ దళాలు
- కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌పై అరబ్ దేశాల ఒత్తిడి
- దాడులు ఆపే ప్రసక్తే లేదని బెంజమిన్ స్పష్టీకరణ
- హిట్ అండ్ రన్ తరహా దాడులతో ఇజ్రాయెల్‌ను ప్రతిఘటిస్తున్న హమాస్
హమాస్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ గాజాను చుట్టుముట్టేసింది. గాజా స్ట్రిప్ ముఖ్యమైన నగరంలోకి ఇజ్రాయెల్ దళాలు చొచ్చుకెళ్లాయి. హమాస్ ఉగ్రవాదులు అండర్‌గ్రౌండ్ టన్నెల్స్ నుంచి ‘హిట్ అండ్ రన్’ దాడులతో ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, అరబ్ దేశాధినేతలు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. గాజా నుంచి వెనక్కి రావాలని, కనీసం తాత్కాలికంగానైనా కాల్పులకు స్వస్తి చెప్పాలని కోరుతున్నారు.
అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ నేడు రెండోసారి ఇజ్రాయెల్ రానున్నారు. మానవతా కోణంలో యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టాలన్న అధ్యక్షుడు జో బైడెన్ ఒత్తిడి మేరకు అక్కడి నుంచి ఆయన జోర్డాన్ వెళ్లనున్నారు. దాడులను ఆపేదేలేదంటూ ఇప్పటికే స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ‘‘తాము ముందుకు సాగుతున్నామని.. ఆపే ప్రసక్తే లేదని’’ పునరుద్ఘాటించారు. గాజా స్ట్రిప్ నుంచి హమాస్‌ను తుడిచిపెట్టేస్తామని చెప్పారు.
నాలుగు వారాలుగా యుద్ధం జరుగుతుండగా ఇజ్రాయెల్ దాడుల్లో 9 వేల మంది పాలస్తీనియన్లు, హమాస్ దాడుల్లో 1400 మంది ఇజ్రాయెలీలు మరణించారు. గురువారం ఇజ్రాయెల్ దళాలు గాజాను చుట్టుముట్టేశాయి. హామాస్ ఉగ్రవాదులు మాత్రం టన్నెళ్ల నుంచి హిట్ అండ్ రన్ తరహా దాడులు చేస్తూ ప్రతిఘటిస్తున్నారు.
హమాస్ ఆర్మ్‌డ్ వింగ్ అధికార ప్రతినిధి అబు ఉబైదా మాట్లాడుతూ.. మిలటరీ చెబుతున్నదానికంటే గాజాలో ఇజ్రాయెలీల మృతుల సంఖ్య ఎక్కువేనని తెలిపారు. ‘‘మీ సైనికుల శవాల్ని సంచుల్లో మూటలు కట్టి పంపిస్తాం’’ అని హెచ్చరించారు.