లంకపై టాస్ ఓడిన టీమిండియా... తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ అవుట్
- వరల్డ్ కప్ లో నేడు టీమిండియా × శ్రీలంక
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక
- నేటి మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా సెమీస్ బెర్తు అధికారికంగా ఖరారు
భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో పరుగుల స్వర్గధామంలా నిలుస్తున్న ముంబయి వాంఖెడే స్టేడియంలో నేడు టీమిండియా, శ్రీలంక జట్లు పోటీపడుతున్నాయి. వరుసగా 6 విజయాలతో ఓటమన్నదే లేకుండా ప్రస్థానం సాగిస్తున్న టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ బెర్తు అధికారికంగా ఖరారు అవుతుంది.
ఈ పోరులో శ్రీలంక టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. భారత జట్టులో అందరూ ఫామ్ లో ఉండడంతో వాంఖెడే పిచ్ పై పరుగుల సునామీ ఖాయమని తెలుస్తోంది. శ్రీలంకతో మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు చేయలేదని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
శ్రీలంక జట్టులో ధనంజయ డిసిల్వ స్థానంలో హేమంత జట్టులోకి వచ్చాడు. శ్రీలంక జట్టు ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ అవుట్
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ 4 పరుగులకే వెనుదిరిగాడు. మధుశంక బౌలింగ్ లో రోహిత్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 1 ఓవర్ ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 8 పరుగులు. క్రీజులో ఓపెనర్ శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.