అన్యమత గుర్తు ఉన్న చెయిన్‌తో గొల్లమండపం ఎక్కిన మంత్రి రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ స్టెయిన్

  • ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న రోజా
  • తిరుమలలో అన్యమత గుర్తులపై నిషేధం
  • ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపంలో గుర్తు  ప్రదర్శన
  • రోజా తిరుమల వచ్చిన ప్రతిసారీ పవిత్రతకు భంగం వాటిల్లుతోందంటున్న భక్తులు
ఏపీ మంత్రి రోజా మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ అన్యమత గుర్తులు ఉన్న గొలుసులతో తిరుమల వద్ద గొల్లమండపం ఎక్కడం వివాదాస్పదమైంది.  ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో మంత్రి రోజా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ స్టెయిన్ కూడా ఉన్నాడు.

తిరుమలలో అన్యమత గుర్తులపై నిషేధం ఉంది. అలిపిరి టోల్‌గేట్ వద్దే భక్తులను తనిఖీ చేసి కొండపైకి పంపుతారు. అయితే, స్టెయిన్ మాత్రం నేరుగా అన్యమత గుర్తు ఉన్న చెయిన్ ధరించి తిరుమల వచ్చాడు. ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం వద్ద గుర్తును ప్రదర్శన చేశాడు. ఇది చూసిన భక్తులు విస్తుపోయారు. రోజా తిరుమల వచ్చిన ప్రతిసారి వెంట స్టెయిన్ కూడా ఉంటాడని, ఈ లెక్కన చూస్తే ప్రతిసారీ తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లుతున్నట్టేనని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News