అకస్మాత్తుగా ఓ రోజు నేను చెత్త కెప్టెన్ అయిపోవచ్చు: రోహిత్ శర్మ
- మైదానంలో తన నిర్ణయాలు టీం ప్రయోజనాల కోణంలో ఉంటాయన్న రోహిత్ శర్మ
- తన నిర్ణయాలు టీం ఉమ్మడి నిర్ణయాలని వ్యాఖ్యలు
- ఉమ్మడి నిర్ణయాలను అమలు పరచడంలో క్రెడిట్ మొత్తం టీం సభ్యులదేనని స్పష్టీకరణ
- కొన్ని సందర్భాల్లో మన నిర్ణయాలు అనుకున్న ఫలితాలు ఇవ్వవని వెల్లడి
వరల్డ్ కప్‌లో దూకుడు మీదున్న భారత్‌పై అంచనాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆరు వరుస మ్యాచుల్లో గెలిచిన టీమిండియా నేడు శ్రీలంకతో మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత శర్మను మీడియా పలకరించింది. తన కెప్టెన్సీ శైలి గురించి వివరించమని కోరింది. ఈ సందర్భంగా రోహిత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘మైదానంలో పరిస్థితులను అంచనా వేస్తా. ఆట ఎటువైపు మళ్లుతోంది అనే అంశం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటా. కొన్ని సార్లు అనుకున్న ఫలితాలు వస్తే కొన్ని సార్లు పరిస్థితి వికటిస్తుంది. కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. టీం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ప్రత్యర్థి టీం బలాబలాల ఆధారంగా నా నిర్ణయాలు ఉంటాయి. ఇదంతా సమష్టి నిర్ణయం. ఈ నిర్ణయాలను అమలు చేస్తున్నందుకు క్రెడిట్ మొత్తం టీం సభ్యులకే దక్కుతుంది. అయితే, పరిస్థితులు అనుకూలంగా సాగుతున్నంత వరకూ అంతా బానే ఉంటుంది. సడన్‌గా ఓ రోజు నాపై చెత్త కెప్టెన్ అని కూడా ముద్ర పడొచ్చు. నాకా విషయంపై అవగాహన ఉంది. అయితే, టీం ప్రయోజనాల దృష్ట్యా కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటా’’ అని ఆయన చెప్పుకొచ్చాడు.