జగన్ కేసుల విచారణలో జాప్యం జరుగుతోందంటూ.. సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్

  • సీబీఐ కోర్టు జగన్‌పై కేసులను 3,071 సార్లు వాయిదా వేసిందన్న రఘురామ
  • కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి
  • రఘురామ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరపనున్న సర్వోన్నత న్యాయస్థానం
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై కేసులకు సంబంధించి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీచేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

‘‘జగన్ కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో జాప్యం జరుగుతోంది. ఈ కేసులను సీబీఐ కోర్టు 3,071 సార్లు వాయిదావేసింది. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. వందల కొద్దీ డిశ్చార్జి పిటిషన్లు వేశారు. డిశ్చార్జ్ పిటిషన్లతో కేసు విచారణ జాప్యం జరిగే అవకాశం ఉంది’’ అని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టి ధర్మాసనం శుక్రవారం విచారణ జరపనుంది.


More Telugu News