నా ఫోన్ ను హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నట్టు ఆపిల్ మెసేజ్ పంపింది: కేటీఆర్
- దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల సందడి
- ఫోన్ హ్యాకింగ్ అలర్ట్ పంపుతున్న ఆపిల్
- తెలంగాణలో రేవంత్, కేటీఆర్ లకు సందేశాలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొన్న నేపథ్యంలో, దేశంలో ఫోన్ హ్యాకింగ్ కలకలం రేగింది. ప్రముఖ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ తన వినియోగదారుల్లోని కొందరు రాజకీయ నేతలకు అలర్ట్ మెసేజ్ లు పంపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తన ఫోన్ కు ఆపిల్ నుంచి అలర్ట్ వచ్చినట్టు వెల్లడించారు.
తాజాగా, తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఆపిల్ నుంచి తనకు కూడా అలర్ట్ మెసేజ్ వచ్చినట్టు ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రభుత్వ అధీనంలో పనిచేసే హ్యాకర్లు మీ ఫోన్ ను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆపిల్ తనకు సందేశం పంపిందని కేటీఆర్ వివరించారు. అయితే, తనకు ఇదేమీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని, ఎందుకంటే విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీ ఎంతకైనా దిగజారుతుందన్న విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో శశిథరూర్, మహువా మొయిత్రా వంటి నేతలకు కూడా ఇదే తరహాలో ఆపిల్ సందేశం పంపింది.