గుమ్మడి కాయను మహిళలు ఎందుకని కోయరు?
- గుమ్మడి కాయ త్యాగానికి చిహ్నం
- సంతానానికి ప్రతిరూపంగా పరిగణింపు
- అందుకే దీన్ని కోయడానికి మహిళలు దూరం
గుమ్మడి కాయకు హిందు ధర్మ శాస్త్రంలో ఎంతో ప్రత్యేకత ఉంది. దీన్ని పవిత్రంగా భావిస్తారు. గుమ్మడి కాయ వెరైటీ ఏదైనా, అందులో ఆరోగ్య పోషకాలు ఎన్నో లభిస్తాయి. దీన్ని పీత, కాశీఫల్, కూష్మాండ అనే రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. గుమ్మడి కాయతో రుచికరమైన వంటలు కూడా చేస్తుంటారు. కానీ, గుమ్మడి కాయను హిందూ మహిళలు చాకుతో కోయరు. ఇంట్లో పురుషుడితో కోయించిన తర్వాత, అప్పుడు కావాలంటే చిన్న పీసులుగా తరుక్కుంటారు. ఎందుకు ఇలా చేస్తారంటే..?
గుమ్మడికాయను సంతాన భాగ్యంగా పరిగణిస్తారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో గుమ్మడి కాయను దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పించే సాధనంగా చూస్తారు. హిందువులు దీన్ని ఇంట్లో పెద్ద కుమారుడిగా పరిగణిస్తారు. సంతాన భాగ్యంగా చూడడం వల్లే గుమ్మడికాయను మహిళలు కోయరు. ఇప్పటికీ చాలా మంది దీన్ని పాటిస్తుంటారు. గుమ్మడి కాయను కోస్తే, మహిళలు సంతానానికి నోచుకోరని, సంతానానికి కీడు జరుగుతుందనే నమ్మకం ఉంది.
మహిళలు గర్భంతో ఉన్నప్పుడు కొబ్బరి కాయ కొట్టడాన్ని కూడా కొందరు అనుసరించరు. కావాలంటే పూజకు కాయను సమర్పిస్తారు కానీ, కొట్టరు. సనాతన ధర్మం ప్రకారం గుమ్మడికాయ, కొబ్బరికాయను త్యాగానికి చిహ్నాలుగా చూస్తారు. అలాగే, సనాతన ధర్మం కింద మహిళలు సృష్తికర్తలు. మరొకరికి జన్మనిస్తారు కనుక గుమ్మడి కాయను కోయడానికి దూరంగా ఉంటారు. జంతు బలులను కూడా పురుషులే చేస్తుండడాన్ని గమనించొచ్చు.