ఆప్ఘనిస్థాన్ గెలుపుతో చిందేసిన ఇర్ఫాన్, హర్బజన్
- శ్రీలంకపై విజయం ఖరారు చేసిన ఆప్ఘనిస్థాన్
- అదే సమయంలో స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో ఉన్న ఇర్ఫాన్, హర్బజన్
- ఇద్దరూ కలసి ఆనందంతో డ్యాన్స్ చేసిన వైనం
భారత మాజీ క్రికెటర్లు ఆప్ఘనిస్థాన్ కు అభిమానులుగా మారిపోయినట్టున్నారు. వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ పై ఆప్ఘనిస్థాన్ గెలిచినప్పుడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఏం చేశాడో గుర్తుండే ఉంటుంది. మైదానంలోనే ఆప్ఘన్ క్రికెటర్లతో కలసి డ్యాన్స్ చేశాడు. ఇప్పుడు మరోసారి అలాంటి దృశ్యమే కనిపించింది. ఈ విడత ఇర్ఫాన్ పఠాన్ కు హర్బజన్ సింగ్ తోడయ్యాడు. ఇద్దరూ కలసి చిందేశారు. ఆప్ఘన్ గెలుపును ఆనందించారు.
నిన్నటి మ్యాచ్ లో శ్రీలంకపై ఆప్ఘనిస్థాన్ సునాయాస విజయాన్ని సొంతం చేసుకోవడం తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఆప్ఘన్ జట్టుకు ఇది మూడో విజయం. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ఆప్ఘన్ విజయం ఖరారైన తర్వాత స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో ఉన్న ఇర్ఫాన్ డ్యాన్స్ చేస్తూ, అక్కడే ఉన్న హర్బజన్ సింగ్ ను కూడా రావాలని కోరాడు. దాంతో హర్బజన్ సింగ్ ముందుకు వచ్చి ఇర్ఫాన్ తో కలసి డ్యాన్స్ చేశాడు.