ఆఫ్ఘనిస్థాన్‌పై మ్యాచ్‌లో అమాంతం వికెట్ల మీద పడిపోయిన కుశాల్ మెండిస్
- బంతిని అందుకోబోయి స్టంప్స్‌పై పడ్డ శ్రీలంక కెప్టెన్
- సరదా వీడియోను షేర్ చేసిన ఐసీసీ
- క్రికెట్ ఫ్యాన్స్‌ని అలరిస్తున్న వీడియో
వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఆఫ్ఘనిస్థాన్ సంచలన విజయం నమోదు చేసింది. 241 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి అబ్బురపరచింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలెట్స్ చాలానే ఉన్నప్పటికి ఆఫ్ఘనిస్థాన్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో శ్రీలంక కెప్టెన్, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ ఓ బంతిని అందుకోబోయి అమాంతం స్టంప్స్‌పై పడిపోయాడు. చాలా హాయిగా పడిపోతున్నట్టు కుశాల్ కనిపించాడు.
బేల్స్ వెలుగుతూ కిందపడిపోయాయి. చూడడానికి సరదాగా ఉన్న ఈ వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘స్టంప్స్ ఇలా ఎలా పడిపోయాయి?’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా ఆఫ్ఘనిస్థాన్‌పై మ్యాచ్‌లో కుశాల్ మెండిస్ బ్యాటింగ్ ఫర్వాలేదనిపించినా ఆశించిన స్థాయిలో రాణించలేదు. 39 పరుగుల వద్ద ఔట్ అవడంతో ప్రారంభాన్ని పెద్ద స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు శ్రీలంక తరపున 6 ఇన్నింగ్స్‌లలో 44.66 సగటుతో 268 పరుగులు చేశాడు.