నా భార్య మీడియాలోనే పనిచేస్తోంది.. అలాంటి ప్రశ్నలు చాలా ఎదుర్కొన్నా: జస్ప్రీత్ బుమ్రా
- గాయంతో క్రికెట్‌కు దూరమైనప్పుడు కెరీర్ ముగిసిందని విమర్శించిన వారికి కౌంటర్
- బలంగా జాతీయ జట్టులోకి రావడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
- ఇంగ్లండ్‌పై మ్యాచ్ అనంతరం ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడిన పేసర్
ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో చెలరేగిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 239 పరుగుల మోస్తరు స్కోరు కాపాడుకోవడంలో బుమ్రా చక్కటి ఆరంభాన్ని అందించాడు. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సందర్భంగా ‘స్కై స్పోర్ట్స్’తో మాట్లాడిన బుమ్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై స్పందించాడు. జాతీయ జట్టులోకి బలంగా పునరాగమనం చేయడం చాలా సంతోషంగా అనిపిస్తోందని చెప్పాడు. గతేడాది బుమ్రా గాయం కారణంగా పెద్దగా క్రికెట్ ఆడలేదు. కెరీర్ ముగిసినట్టేనని ఆ సమయంలో సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగిందని, అదంతా తప్పు అని నిరూపించినందుకు ఆనందంగా ఉందన్నాడు.
తన భార్య (టీవీ స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజనా గణేశన్) కూడా స్పోర్ట్స్ మీడియా విభాగంలో పనిచేస్తోందని, కాబట్టి తాను తిరిగి జట్టులోకి రాలేననే ప్రశ్నలు చాలానే విన్నానని చెప్పాడు. కానీ అది నిజం కాదని, తాను తిరిగి జట్టులోకి వచ్చానని చెప్పాడు. క్రికెట్ ఆడడం ఎంతగా ఆస్వాదిస్తానో గ్రహించానని తెలిపాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌పై స్పందిస్తూ కాస్త ఒత్తిడికి గురికావడం మంచి సవాలు అని, ఆరంభంలో వికెట్లు కోల్పోయామని అన్నాడు. బౌలర్లు రాణించడంతో మంచి ఫలితం వచ్చిందని, చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు పరిస్థితి ఏవిధంగా ఉంటుందో గమనించుకోవడానికి ఇది దోహదపడిందని బుమ్రా చెప్పాడు.