విజయనగరం జిల్లా రైలు ప్రమాదం.. నేడూ పలు రైలు సర్వీసుల రద్దు

  • హవ్‌డా-సికింద్రాబాద్, హవ్‌డా-బెంగళూరు, షాలీమార్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుల రద్దు
  • భువనేశ్వర్-కేఎస్‌ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్ మార్పు
  • తిరుపతి-పూరి, తిరుపతి-విశాఖ, పలాస-విశాఖ రైళ్ల కూడా రద్దు
విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు. హవ్‌డా-సికింద్రాబాద్ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, హవ్‌డా-బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్, షాలీమార్-హైదరాబాద్ (18045) ఈస్ట్ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. 

తిరుపతి-పూరి (17480) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ (08531) ప్యాసింజర్, తిరుపతి-విశాఖ (08584) ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్ (17240) ఎక్స్‌ప్రెస్‌లనూ రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. భువనేశ్వర్-కేఎస్‌ఆర్ బెంగళూరు (18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌నూ రీషెడ్యూల్ చేశారు. నేటి ఉదయం 5.40 గంటలకు బయలుదేరాల్సిన రైలు 10 గంటలకు వెళుతుందని చెప్పారు. రైలు ప్రమాదం నేపథ్యంలో నిన్న కూడా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.


More Telugu News