చంద్రబాబుని తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు: తెలుగు ప్రొఫెషనల్స్ సంఘం అధ్యక్షురాలు తేజస్విని
- రాష్ట్రాన్ని తన కుటుంబంగా మార్చుకున్నారని ప్రశంస
- చంద్రబాబు ఎవరి కోసమైతే కష్టపడ్డారో వారందరూ వచ్చారని హర్షం
- కృతజ్ఞత కచేరిలో ఉద్వేగభరితంగా మాట్లాడిన తేజస్విని
మంచి చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబును తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలుగు ప్రొఫెషనల్స్ సంఘం అధ్యక్షురాలు తేజస్విని అన్నారు. అమెరికా సైతం ఇటువైపు చూసేలా చేసిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. రాష్ట్రాన్ని తన కుటుంబంగా మార్చుకుని విద్యార్థులు, యువత కోసం తపన పడిన వ్యక్తి అని ప్రశంసించారు. ఐఎస్‌బీ, ట్రిపుల్‌ఐటీ, గచ్చిబౌలి స్టేడియం, మైక్రోసాఫ్ట్, జీనోమ్‌వ్యాలీ ఇలా ఎన్నో సృష్టించారని పొగిడారు. హైదరాబాద్‌లో ‘సైబర్‌టవర్స్’ నిర్మాణం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ ఈవెంట్‌లో ఆమె మాట్లాడారు.
ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తుంటే అమెరికా ఇటువైపు చూసేలా చంద్రబాబు చేశారని, ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకున్నారని తేజస్విని అన్నారు. కృతజ్ఞతా కచేరికి పెద్ద సంఖ్యలో హాజరైనవారిని ఉద్దేశించి ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. చంద్రబాబు ఎవరి కోసమైతే కష్టపడ్డారో వారందరూ ఇక్కడికి వచ్చారని తేజస్విని అన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో బాబు నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. మంచి చేసిన నాయకులను, జీవితాలను మార్చిన నాయకత్వాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారని తెలియజేయడానికి ఈ కృతజ్ఞత కచేరి అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు తేజస్విని మాట్లాడిన వీడియోని టీడీపీ ట్విటర్ వేదికగా షేర్ చేసింది.