థర్డ్ రేట్ క్రిమినల్‌ను టీపీసీసీ చీఫ్‌గా నియమించినప్పుడే ఊహించాం: ప్రభాకర్ రెడ్డిపై దాడి పట్ల కేటీఆర్ వ్యాఖ్య
- కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్న కేటీఆర్
- ఓటమి ఖాయమని తెలిసి కాంగ్రెస్ నిరాశతో భౌతిక దాడులకు పాల్పడుతోందని ఆరోపణ
- ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న మంత్రి
- ఈ దాడికి సంబంధించి ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం
- హత్యా రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదన్న ఎమ్మెల్సీ కవిత
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ గూండాల దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఓటమి ఖాయమని తెలిసిన కాంగ్రెస్ నిరాశతో మన నాయకులపై భౌతిక దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. థర్డ్ రేటు క్రిమినల్‌ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించినప్పుడే ఊహించామన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
దాడిని ఖండించిన కవిత
బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హత్య రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగడం సరికాదన్నారు. ఎన్నికలను ఎదుర్కోలేక ఇలాంటి సంఘవిద్రోహక చర్యలకు పాల్పడడాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సహించరని, తస్మాత్ జాగ్రత్త.. అని హెచ్చరించారు.