చంద్రబాబు బతకాలి... జగన్ రెండోసారి సీఎం అవడం చూడాలి: ఎంపీ గోరంట్ల మాధవ్
- చంద్రబాబు చస్తాడు అంటూ ఇటీవల వ్యాఖ్యానించిన గోరంట్ల మాధవ్
- ఇప్పుడు మరో విధంగా వ్యాఖ్యానించిన వైసీపీ ఎంపీ
- జగన్ మళ్లీ సీఎం అవడం చూసి చంద్రబాబు ఏడవాలని వ్యాఖ్యలు
- చంద్రబాబు చావడానికి వీల్లేదు అంటూ స్పష్టీకరణ
వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిచి సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు అంటూ వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈసారి మరో విధంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు బతకాలి... జగన్ రెండోసారి సీఎం కావడం చూసి ఆయన ఏడవాలి అని ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.
చంద్రబాబును జైలుకు పంపింది సీఎం జగన్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని గోరంట్ల మాధవ్ ఖండించారు. "ఎఫ్ఐఆర్ నమోదు చేసింది పోలీసులు... జగన్ కాదు. దర్యాప్తు చేసింది పోలీసులు... జగన్ కాదు. చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపింది నువ్వో, నేనో, ఇంకెవరో కాదు... కోర్టుకు ఆ అధికారం ఉంది, జడ్జిలకు ఆ అధికారం ఉంది. కోర్టు చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న వ్యక్తి జైల్లో ఉండాలి.
జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ఈ ప్రభుత్వానిదే భరోసా. జైల్లో అందరు ముద్దాయిల కంటే చంద్రబాబు పెద్ద ముద్దాయి కాబట్టి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తుంది. చంద్రబాబు ప్రాణాలకు ఈ ప్రభుత్వం ప్రాణాలైనా అడ్డువేసి బతికిస్తుంది. చంద్రబాబు బతకాలి... 2024లో జగన్ మళ్లీ సీఎం కావడాన్ని ఆయన చూడాలనేది మా ఆకాంక్ష. చంద్రబాబు చనిపోవడానికి వీల్లేదు" అంటూ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు.