ఛాంపియన్లు అని మీకు మీరే చెప్పుకోవాలి: ఇంగ్లండ్ పై రవిశాస్త్రి సెటైర్
- అందరి చేతిలో చిత్తు అవుతున్న ఇంగ్లండ్ అంటూ కామెంట్
- ప్రేక్షకులు, వీక్షకులను కూడా చిత్తు చేస్తోందంటూ వ్యగ్యం
- ఇంగ్లండ్ ఆట తీరును ఎండగట్టిన రవిశాస్త్రి
వన్డే ప్రపంచకప్ 2019 విజేతేనా ఆడుతున్నది? వన్డే ప్రపంచకప్ 2023లో ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన చూసిన తర్వాత సొంత అభిమానుల్లోనూ కలుగుతున్న సందేహం ఇదే. డిఫెండింగ్ ఛాంపియన్లు అన్న మాట అటుంచితే, గట్టి పోటీ అయినా ఇవ్వాలి కదా. గెలుపు మాటేమో కానీ, ప్రత్యర్థి చేతిలో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా ఇంగ్లండ్ తీరు ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న పాటి స్కోర్లను కూడా ఛేదించలేని అశక్తతతో ఆ జట్టు ఉందనడంలో సందేహం లేదు. అందుకే క్రికెట్ పండితులు సైతం ఇంగ్లండ్ జట్టు ఆట తీరును పోస్ట్ మార్టమ్ చేసేస్తున్నారు.
భారత వెటరన్ రవిశాస్త్రి కూడా ఇంగ్లండ్ జట్టును ఏకిపారేశారు. అది కూడా నిన్నటి మ్యాచ్ సందర్భంగా కామెంటరీలోనే. ‘‘ఇంగ్లండ్ వీక్షకులు, అభిమానులను సైతం చిత్తు చేస్తోంది. మొదటి మ్యాచ్ లో మరో 14 ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లోనూ 20 ఓవర్లకే ఆల్ అవుట్ అయిపోయింది. శ్రీలంక చేతిలోనూ 30 ఓవర్లకే ఆల్ అవుట్ అయ్యారు. శ్రీలంక 25 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు మరో 32 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ చేతిలో ఓటమి పాలైంది. మీకు మీరే ప్రపంచ ఛాంపియన్లు అని చెప్పుకోవాలి? తమ పనితీరు విషయంలో వారు విచారించకపోతే ఎవరు విచారిస్తారు?’’ అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.