భావోద్వేగంతో రోహిత్ శర్మను పైకెత్తిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

  • వరల్డ్ కప్ లో వరుసగా ఆరు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా
  • నిన్న ఇంగ్లాండ్ ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
  • ఆనందంతో రోహిత్ ను హత్తుకున్న కోహ్లీ
ప్రపంచకప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన ఇండియా... అన్ని మ్యాచ్ లలో ఘన విజయం సాధించింది. నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సూపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 229 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 87 పరుగులు చేశాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలు ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చారు. ఈ మ్యాచ్ లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన వెంటనే రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ సంతోషంతో హత్తుకున్నాడు. రోహిత్ ను కోహ్లీ పైకి ఎత్తాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


More Telugu News