విజయనగరం జిల్లాలో రెండు రైళ్ల ఢీ... ముగ్గురి మృతి
- కొత్తవలస మండలంలో ఆగివున్న రైలును ఢీకొన్న మరో రైలు
- పట్టాలు తప్పిన మూడు బోగీలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
ఏపీలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విశాఖ నుంచి పలాస వెళుతున్న స్పెషల్ ప్యాసింజర్ రైలును విశాఖ-రాయగడ రైలు ఢీకొట్టింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు ఆగి ఉంది. అయితే, అదే ట్రాక్ పై వచ్చిన విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్ ను ఢీకొనడంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఘటన స్థలి వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. రైళ్లు ఢీకొనడంతో వైర్లు తెగిపోయాయి. దాంతో ఇక్కడంతా అంధకారం నెలకొని ఉంది.