టీమిండియా బౌలర్ల విజృంభణ... 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
- లక్నోలో వరల్డ్ కప్ మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు
- లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ విలవిల
ఓ మోస్తరు స్కోరును కాపాడుకునే యత్నంలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. లక్నోలో జరుగుతున్న పోరులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది.
అయితే, లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ తడబాటుకు గురైంది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు జో రూట్ (0), బెన్ స్టోక్స్ (0) లకు కనీసం ఖాతా తెరిచే అవకాశం కూడా ఇవ్వలేదు. బెయిర్ స్టో 14, డేవిడ్ మలాన్ 16, కెప్టెన్ జోస్ బట్లర్ 10 పరుగులకే వెనుదిరిగారు. బుమ్రా 2, షమీ 2, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.
ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 21 ఓవర్లలో 5 వికెట్లకు 72 పరుగులు. మొయిన్ అలీ 13, లియామ్ లివింగ్ స్టన్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 158 పరుగులు చేయాలి.