40 పరుగులకే 3 వికెట్లు డౌన్... కష్టాల్లో టీమిండియా
- వరల్డ్ కప్ లో నేడు టీమిండియా × ఇంగ్లండ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- తక్కువ స్కోరుకే వెనుదిరిగిన గిల్, కోహ్లీ, అయ్యర్
- వోక్స్ కు రెండు వికెట్లు
లక్నోలో ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 9 పరుగులు చేసి క్రిస్ వోక్స్ బౌలింగ్ బౌల్డ్ కాగా, సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ (0) డకౌట్ కావడం టీమిండియా అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కోహ్లీ డకౌట్ కావడాన్ని స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు నమ్మలేకపోయారు. 9 బంతులు ఆడినప్పటికీ ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన కోహ్లీ... ఇంగ్లండ్ లెఫ్టార్మ్ పేసర్ డేవిడ్ విల్లీ బౌలింగ్ లో షాట్ కొట్టగా, అది కాస్తా స్టోక్స్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. వోక్స్ బౌలింగ్ లో ఓ షార్ట్ బంతిని కొట్టబోయిన అయ్యర్... మార్క్ వుడ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 16 బంతులు ఆడిన అయ్యర్ చేసింది నాలుగు పరుగులే.
ప్రస్తుతం టీమిండియా స్కోరు 14 ఓవర్లలో 3 వికెట్లకు 49 పరుగులు. క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ (33 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (3 బ్యాటింగ్) ఉన్నారు.