నీ ఇష్టం.. ఉద్యోగంలో ఉండాలంటే కస్టమర్లకు ముద్దులు ఇవ్వాల్సిందే!
- ఫిట్‌నెస్ శిక్షకురాలిగా ఉద్యోగంలో చేరిన మహిళ
- పురుష కస్టమర్లు చెప్పినట్టు చేయాలంటూ ఒత్తిడి
- ముద్దులు పెట్టాలంటూ బెదిరింపులు
ఉద్యోగంలో ఉండాలంటే కస్టమర్లకు ముద్దులు ఇవ్వాల్సిందేనంటూ ఓ మహిళను ఒత్తిడి చేసిన నిర్వాహకులపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. బండ్లగూడకు చెందిన ఓ మహిళ పంజాగుట్టలోని ఒక మసాజ్ సెంటర్‌లో నెలకు రూ. లక్ష వేతనంతో ఫిట్‌నెస్ శిక్షకురాలిగా చేరింది. కస్టమర్లకు మసాజ్, శ్వాసకు సంబంధించిన వ్యాయాయం చేయించే బాధ్యతలు నిర్వాహకులు ఆమెకు అప్పగించారు.
కొన్ని రోజులు గడిచిన తర్వాత తమ వద్దకు వచ్చే పురుష కస్టమర్లు చెప్పినట్టు చేయాలని, అలా చేస్తేనే ఉద్యోగం ఉంటుందని నిర్వాహకులు ఆమెపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. వారికి ముద్దులివ్వాలని, వారు చెప్పినట్టు చేయాలని ఒత్తిడి చేయడంతోపాటు బెదిరింపులకు గురిచేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.