ఆ మహాసభకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానిస్తున్నాం: మంద కృష్ణ మాదిగ

  • ఎస్సీ వర్గీకరణ పోరు కీలక దశకు చేరుకుందన్న మంద కృష్ణ
  • నవంబర్ 18న పరేడ్ మైదానంలో మాదిగల విశ్వరూప మహాసభ నిర్వహించనున్నట్లు వెల్లడి
  • ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకి మాదిగల మద్దతు ఉంటుందని వ్యాఖ్య
ఎస్సీ వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత మంద కృష్ణ మాదిగ అన్నారు. శనివారం ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నవంబర్ 18న హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో లక్షలాదిమందితో మాదిగల విశ్వరూప మహాసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం కీలకదశకు చేరుకుందన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితేనే పిల్లల చదువులు బాగుపడతాయని, చదువుకున్నవారికి ఉద్యోగాలు వస్తాయన్నారు. పార్టీలకు అతీతంగా దళితులందరూ హైదరాబాద్‌లో జరిగే మహాసభకు హాజరుకావాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.


More Telugu News