అనుచరులతో సమావేశంలో కంటతడి పెట్టిన సుభాష్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
- ఎల్లారెడ్డి టిక్కెట్ ఆశించిన సుభాష్ రెడ్డి
- మదన్ మోహన్‌కు టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం
- అనుచరులతో భేటీ అయిన సుభాష్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల కోసం 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితా ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. టిక్కెట్ ఆశించి భంగపడిన చాలామంది నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ఆశించి భంగపడిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి శనివారం కన్నీరుమున్నీరయ్యారు. ఎల్లారెడ్డి టిక్కెట్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం మదన్ మోహన్‌కు ఇచ్చింది. దీంతో సుభాష్ రెడ్డి ఈ రోజు తన అనుచరులతో భేటీ అయ్యారు. వారితో మాట్లాడుతూ... ఒక్కసారిగా భోరుమన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ దక్కుతుందని భావించిన జంగా రాఘవరెడ్డికి కూడా నిరాశ ఎదురైంది. ఈ టిక్కెట్ నాయిని రాజేందర్ రెడ్డికి దక్కింది. జంగా రాఘవరెడ్డి మొదట జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో పని చేశారు. ఆ తర్వాత పార్టీ పెద్దల సూచన మేరకు వరంగల్ పశ్చిమకు వెళ్లారు. కానీ టిక్కెట్ రాలేదు. దీంతో ఆయన కూడా తన అనుచరుల వద్ద కంటతడి పెట్టారు.