దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయాక సహనం కోల్పోయిన పాక్ కెప్టెన్ బాబర్!
- మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసిన నవాజ్‌పై రుసరుస
- కోపంగా చూస్తూ అరిచిన కెప్టెన్ బాబర్
- వరుస ఓటముల కారణంగా అసహనం
వరల్డ్ కప్ 2023లో పేలవ ప్రదర్శన ఫలితంగా వరుస ఓటములు, ఇంటాబయటా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సహనాన్ని కోల్పోయాడు. శుక్రవారం దక్షిణాఫ్రికా చేతిలో విజయం చేజారిన అనంతరం సహచర ఆటగాడిపై కోప్పడుతూ కనిపించాడు. స్పిన్నర్ మహ్మద్ నవాజ్‌పై ఆగ్రహంతో రుసరుసలాడాడు. కెమెరా కళ్లకు చిక్కిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో పేసర్ల ఓవర్లు అయిపోవడంతో కెప్టెన్ బాబర్ బంతిని స్పిన్నర్ నవాజ్‌కి అప్పగించాడు. అయితే విజయానికి అవసరమైన చివరి వికెట్ ఆ ఓవర్‌లో పడలేదు. పైగా క్రీజులో ఉన్న మహరాజ్ చక్కటి బౌండరీని కొట్టి దక్షిణాఫ్రికాకు విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో నవాజ్‌పై బాబర్ రుసరుసలాడాడు. ఆవేశంతో అరుస్తున్నట్టుగా కనిపించాడు. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాక మైదానంలోనే ఈ సన్నివేశం చోటుచేసుకుంది.
కాగా.. దక్షిణాఫ్రికా స్టార్‌బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్‌క్రమ్ 91 పరుగులతో రాణించి తన జట్టుని గెలిపించాడు. నిజానికి 206/4 పటిష్ఠ స్థితిలో ఉన్న దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. అయితే, కాస్త తడబాటుకు గురై.. పీకల మీదకు తెచ్చుకుని.. చివరికి విజయం సాధించింది. 11 బంతులు మిగిలి ఉండగానే గెలిచినప్పటికీ కాసేపు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది.