‘పంబన్ బ్రిడ్జి’ నిర్మాణ పనుల వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర.. మీరూ చూసేయండి

  • సిద్ధమవుతున్న తొలి నిలువు లిఫ్ట్ రైల్వే సముద్రపు బ్రిడ్జి
  • 17 మీటర్లు పైకెత్తి కింద నుంచి నౌకలను పంపించే సౌకర్యం
  • వేగంగా కొనసాగుతున్న పనులు.. త్వరలోనే అందుబాటులోకి
పంబన్ ద్వీపంలోని పవిత్ర రామేశ్వరంను, దేశంలోని ప్రధాన భూభాగానికి కలిపే భారతదేశ ‘తొలి నిలువు లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జి’ నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. కొత్త పంబన్ బ్రిడ్జ్ నిర్మాణ దశలో ఉందంటూ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు, ఇందుకోసం మోహరించిన యంత్రసామగ్రిని ఇందులో చూపించారు. బ్రిడ్జి అప్రోచ్‌లు, లిఫ్టింగ్ టవర్స్, మొత్తం 333 పిల్స్‌ను మోహరించి నిర్మిస్తున్నట్టు ఇందులో వెల్లడించారు. 

బ్రిడ్జిని 17 మీటర్లు పైకి ఎత్తి నౌకలు దాని కింద నుంచి వెళ్లేలా దీనిని నిర్మిస్తున్నారు. నౌకలు వచ్చే సమయంలో బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రైళ్లు వేగంగా నడిచే ఆస్కారం ఉంటుంది. ఎక్కువ బరువును మోయగలిచే సామర్థ్యం కూడా ఉంటుంది. రామేశ్వరం, ధనుష్కోటి ఆలయాల మధ్య ట్రాఫిక్ తగ్గుదలకు కూడా దోహదపడనుంది.

ఇక కొత్తగా నిర్మిస్తున్న పంబన్ బ్రిడ్జికి చాలా వివేషాలు ఉన్నాయి. 1914లో ప్రారంభించిన భారత తొలి సముద్ర వంతెన ఇది. దీని స్థానంలో ఇప్పుడు కొత్త బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. పొడవు 2.078 కి.మీగా ఉంది. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.279.63 కోట్లు. ఫిబ్రవరి 2020లో మొదలైన నిర్మాణ పనులు ఈ ఏడాది చివర్లో పూర్తవుతాయని భావిస్తున్నారు. 


More Telugu News