సింగపూర్‌లో కాలేజీ అమ్మాయిపై అత్యాచారం.. భారతీయుడికి 16 ఏళ్ల జైలు
- 2019 మే 4న ఘటన
- సింగపూర్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్న చిన్నయ్య
- అత్యాచారం తర్వాత ఆమె వస్తువులతో పరార్
- ఒక్క రోజులోనే నిందితుడి అరెస్ట్
కాలేజీ అమ్మాయిపై అత్యాచారం కేసులో ఓ భారతీయుడికి సింగపూర్ కోర్టు 16 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 4 మే 2019లో ఓ యూనివర్సిటీ విద్యార్థిని రాత్రి పొద్దుపోయాక బస్‌స్టాప్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. అక్కడ క్లీనర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల చిన్నయ్య ఆమెకు తప్పుడు సమాచారం ఇచ్చి వేరే మార్గంలోకి మళ్లించాడు. ఆ తర్వాత ఆమెపై దాడిచేసి గాయపరిచి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
యువతిపై దాడిచేసిన చిన్నయ్య ఆమె గొంతు నొక్కడంతో ఊపిరి ఆడలేదని, అతడి చెయ్యిని అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేసిందని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కయాల్ పిల్లే తెలిపారు. అయితే, పట్టువిడవని చిన్నయ్య సైలెంట్‌గా ఉండాలని, అరిచి గింజుకున్నా ఇక్కడెవరూ రారని హెచ్చరించాడు. అత్యాచారం అనంతరం ఆమె వస్తువులతో అక్కడి నుంచి పరారయ్యాడు.
ఆమె ఫోన్ చిన్నయ్య తీసుకెళ్లిన బ్యాగ్‌లో ఉండిపోవడంతో బాయ్‌ఫ్రెండ్‌కు విషయం చెప్పలేకపోయింది. ఆ తర్వాత అతి కష్టం మీద ఓ స్నేహితుడికి జరిగింది చెప్పగా, అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత రోజే చిన్నయ్యను అరెస్ట్ చేశారు. తాజాగా విచారణ పూర్తి కాగా చిన్నయ్యకు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.