ఒక్క ఇన్నింగ్స్ కూడా గొప్పగా ఆడలేకపోయాడు.. పాక్ కెప్టెన్‌పై గౌతమ్ గంభీర్ ఫైర్

  • సౌతాఫ్రికాపై ఉత్కంఠ పోరులో ఓడిన పాక్
  • ఆరు మ్యాచుల్లో నాలుగింటిలో ఓటమి
  • బాబర్‌ను అతిగా అంచనా వేశారన్న గౌతీ
ప్రపంచకప్‌లో భాగంగా గత రాత్రి సౌతాఫ్రికాతో చెన్నైలో జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ మరోమారు ఓటమి పాలైంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చివరి వరకు ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం అంతిమంగా సౌతాఫ్రికానే వరించింది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ జట్టుపై మరోమారు విమర్శల వర్షం కురిసింది. 

ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఆటతీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ టోర్నీలో బ్యాటింగ్ తీరు నత్తనడకన సాగుతోందని అభిమానులు మండిపడుతున్నారు. రాత్రి మ్యాచ్‌లో 65 బంతుల్లో 50 పరుగులు చేసిన బాబర్.. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్‌పై 92 బంతుల్లో 74, ఇండియాపై 58 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆరు మ్యాచుల్లో మూడు అర్ధ సెంచరీలు చేసినప్పటికీ బ్యాటింగ్‌లో జోరు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అంచనాలకు అనుగుణంగా ఆడడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

బాబర్ ఓవర్ రేటెడ్
టీమిండియా ప్రపంచకప్ హీరో గౌతం గంభీర్ తాజాగా బాబర్‌ను తీవ్రంగా విమర్శించాడు. ప్రపంచకప్‌లో పాక్ కెప్టెన్ ఇప్పటి వరకు ఒక్క ప్రభావవంతమైన ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడని అన్నాడు. అతడి కెరియర్, రికార్డులు, ర్యాంకింగ్స్‌ను అతిగా అంచనా వేశారని, మ్యాచ్‌ను గెలిపించిన వారే నిజమైన నంబర్ 1 అని అభిప్రాయపడ్డాడు.


More Telugu News