ముందస్తు బెయిల్ ఇవ్వండి.. మల్కాజ్‌గిరి కోర్టులో అజారుద్దీన్ పిటిషన్

  • హెచ్‌సీఏలో నిధుల గోల్‌మాల్ కేసులో పిటిషన్
  • ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి
  • నవంబర్ 1న విచారణ చేపట్టనున్న కోర్టు
హెచ్‌సీఏలో నిధుల గోల్‌మాల్ కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ మల్కాజ్‌గిరి కోర్టులో ఈ మేరకు పిటిషన్ వేశారు. నిధుల అవకతవకల వ్యవహారం వెలుగుచూశాక ఉప్పల్ పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి అజారుద్దీన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే తాజాగా కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై నవంబర్ 1న విచారణ జరగనుంది.

ఇదిలావుండగా, టెండర్ల పేరుతో నిధులను థర్డ్ పార్టీకి కట్టబెట్టారని అజారుద్దీన్ పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నాలుగు కేసులు నమోదు చేసింది. 2020 -2023 మధ్య నిధులు గోల్‌మాల్ చేశారని రిపోర్ట్ లో పేర్కొంది. క్రికెట్ బాల్స్ కొనుగోలులో ఒక్కో బంతిని 392 రూపాయలకు బదులు 1400 రూపాయలకు వర్క్ ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. బాల్స్ కొనుగోలులో 57 లక్షలు నష్, జిమ్ పరికరాల పేరిట 1.53 కోట్లు, బకెట్ చైర్స్ కొనుగోలులో 43 లక్షలు. ఫైర్ ఫైటింగ్ పరికరాల పేరిట 1.50 కోట్ల మేర హెచ్‌సీఏకి నష్టం వచ్చేలా చేశారని రిపోర్ట్ లో పేర్కొంది.


More Telugu News