థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్ పరిస్థితి ఏంటి?.. ఇంకా సెమీస్ అవకాశం ఉందా?

  • 4 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయిన పాక్
  • సెమీస్ చేరుకోవడం ఇక దాదాపు అసాధ్యం
  • అత్యద్భుతాలు నమోదైతే తప్ప పాక్ నిష్ర్కమణ అనివార్యం
వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023‌లో పాకిస్థాన్ ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో కూడా ఆ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 1 వికెట్ తేడాతో ఓటమిని చవిచూసింది. విజయానికి చేరువైనట్టే కనిపించినా దక్షిణాఫ్రికానే అదృష్టం వరించింది. ఫలితంగా పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో ఆరవ స్థానానికి పడిపోయింది. ఆరు మ్యాచ్‌లు ఆడిన పాక్ కేవలం రెండు మ్యాచ్‌లు గెలిచి నాలుగు పాయింట్లకే పరిమితమైంది. ఈ ఓటమితో పాక్ సెమీస్ చేరే అవకాశాలు దాదాపు ముగిసిపోయాయి. ఏమాత్రం అవకాశంలేని, ఊహించలేని పెనుసంచలనాలు నమోదైతే తప్ప టాప్-4లో పాక్ అడుగుపెట్టే అవకాశం ఏమాత్రం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.  

ఇదిలావుండగా పాకిస్థాన్‌పై విజయం సాధించిన సఫారీ టీమ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ ఖాతాలో కూడా 10 పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో రెండవ స్థానానికి పరిమితమైంది. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ మూడో స్థానంలో, ఆస్ట్రేలియా 4, శ్రీలంక 5వ, స్థానాల్లో ఉన్నాయి.

కాగా శుక్రవారం పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ చివరిలో థ్రిల్లింగ్‌గా ముగిసింది. తొలుత పాకిస్థాన్‌ను దక్షిణాఫ్రికా 270 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత చివరి వికెట్‌కు లక్ష్యాన్ని సాధించింది. 93 బంతుల్లో 91 పరుగులు చేసిన మార్‌క్రమ సఫారీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.


More Telugu News