చంద్రబాబు బ్యారక్ లోకి గంజాయి వేశారు.. పెన్ కెమెరాతో చంద్రబాబు కదలికలు రికార్డ్ చేశారు: న్యాయవాది లక్ష్మీనారాయణ

  • జడ్ ప్లస్ సెక్యూరిటీ వ్యక్తికి భద్రత లేకుండా చేశారన్న లక్ష్మీనారాయణ
  • జైల్లోకి పెన్ కెమెరా ఎలా వచ్చిందని ప్రశ్న
  • బాబు కుటుంబ సభ్యుల కదలికలపై కూడా నిఘా పెట్టారని విమర్శ
విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై ఆయన తరపు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. తన అనారోగ్య పరిస్థితి, జైల్లో భద్రతపై ఉన్న అనుమానాలను లేఖలో చంద్రబాబు పేర్కొన్నారని చెప్పారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి జైల్లో భద్రత లేకుండా చేశారని విమర్శించారు. చంద్రబాబు బ్యారెక్ లోకి గంజాయి వేశారని, ఆయన కదలికలను పెన్ కెమెరాతో చిత్రీకరించారని చెప్పారు. జైల్లోకి పెన్ కెమెరా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బాబు కుటుంబ సభ్యుల కదలికలపై కూడా నిఘా పెట్టారని చెప్పారు. 

గత చంద్రబాబు పర్యటనలో ఆయన కాన్వాయ్ పైకి రాళ్లు రువ్వారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారని చెప్పారు. బాబు ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబుకు జైల్లో అన్ని సదుపాయాలు లభిస్తున్నాయని వైసీపీ నేతలు చెపుతున్నారని... అంటే వైసీపీ నేతలు చంద్రబాబు కదలికలను మానిటరింగ్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.


More Telugu News