వచ్చాను... చేరాను: కాంగ్రెస్ కండువా కప్పుకున్న అనంతరం మోత్కుపల్లి వ్యాఖ్యలు
- నవంబరు 30న తెలంగాణ ఎన్నికలు
- కాంగ్రెస్ లోకి భారీగా వలసలు
- ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న మోత్కుపల్లి
- త్వరలో అన్ని విషయాలు చెబుతానని వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో వలసలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఎక్కువయ్యాయి. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో తెలంగాణ కాంగ్రెస్ లో చాలామంది నేతలు చేరారు. వారిలో సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా ఉన్నారు.
కాంగ్రెస్ లో చేరికపై ఆయనను మీడియా పలకరించింది. వచ్చాను, చేరాను అంటూ కట్టె విరిచినట్టు సమాధానం చెప్పారు. ఇప్పుడేమీ మాట్లాడబోనని, త్వరలో అన్ని విషయాలు తప్పకుండా చెబుతానని అన్నారు.
ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరగా, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, సంతోష్ కుమార్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఒకేసారి ఇంతమంది నేతలు చేరడంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం రెట్టింపైంది.