భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

  • 634 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 190 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3 శాతానికి పైగా పెరిగిన యాక్సిస్ బ్యాంక్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 634 పాయింట్లు లాభపడి 63,782కి ఎగబాకింది. నిఫ్టీ 190 పాయింట్లు పెరిగి 19,047కి చేరుకుంది. అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో కొన్ని సెషన్లుగా మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఈ వారం ట్రేడింగ్ ముగియనున్న నేపథ్యంలో, మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో, మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (3.07%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.01%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.53%), టాటా మోటార్స్ (2.27%), ఎన్టీపీసీ (2.12%). 

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-0.14%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.07%), ఐటీసీ (-0.03%).


More Telugu News