మరోసారి నిరాశపరిచిన పాక్ టాపార్డర్

  • వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
  • 141 పరుగులకే 5 వికెట్లు డౌన్
  • అర్ధసెంచరీ చేసిన కెప్టెన్ బాబర్ అజామ్
వరల్డ్ కప్ లో మాంచి ఊపుమీదున్న దక్షిణాఫ్రికా జట్టుతో తలపడుతున్న పాకిస్థాన్ కు బ్యాటింగ్ కష్టాలు తప్పలేదు. పాక్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, టాపార్డర్ వైఫల్యం మరోసారి కొట్టొచ్చినట్టు కనిపించింది. 

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ పోరు జరుగుతుండగా, మొదట బ్యాటింగ్ కు దిగిన పాక్ 27.5 ఓవర్లలో 141 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ బాబర్ అజామ్ (50) అర్ధసెంచరీతో రాణించినా, కీలక సమయంలో అవుటయ్యాడు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ 9, ఇమామ్ ఉల్ హక్ 12 పరుగులు చేసి పేలవ ఆరంభాన్నిచ్చారు. 

మహ్మద్ రిజ్వాన్ (31), ఇఫ్తికార్ అహ్మద్ (21) ఓ మోస్తరుగా రాణించినా, సఫారీ స్పిన్నర్ తబ్రైజ్ షంసీ మ్యాజిక్ కు తలవంచారు. షంసీ 5 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. లెఫ్టార్మ్ సీమర్ మార్కో యన్సెన్ 2, గెరాల్డ్ కోట్జీ 1 వికెట్ తీశారు. 

ప్రస్తుతం పాక్ స్కోరు 30 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు కాగా... సాద్ షకీల్ 14, షాదాబ్ ఖాన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.


More Telugu News