కాంగ్రెస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి... కోమటిరెడ్డితో కలిసి ఏఐసీసీ కార్యాలయానికి...
- ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కండువా కప్పుకున్న మోత్కుపల్లి
- మోత్కుపల్లితో పాటు నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి కూడా చేరిక
- కాంగ్రెస్ పార్టీలోకి వరుస చేరికలు
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆ పార్టీ జెండాను కప్పుకున్నారు. ఆయనతో పాటు మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మోత్కుపల్లి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఆయనకు పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదు. బీఆర్ఎస్ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఆయన ఆ పార్టీని వీడారు.
మోత్కుపల్లిని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి తీసుకువచ్చారు. తనకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం వచ్చినట్లు ఆయన కొన్నిరోజుల క్రితమే చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పటాన్‌చెరు నేత నీలం ముదిరాజ్‌లు కూడా నిన్న, ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.