అలా చేస్తే బాబర్ అజామ్ ను పాకిస్థాన్ మొత్తం క్షమిస్తుంది: ఇమాద్
- బాబర్ అజామ్ పై వస్తున్న విమర్శల పట్ల మాజీ క్రికెటర్ స్పందన
- ప్రపంచ కప్ గెలిస్తే బాబర్ ను పాకిస్థాన్ ప్రజలు క్షమిస్తారన్న అభిప్రాయం
- ఆప్ఘనిస్థాన్ పై ఓటమి తర్వాత పెరిగిపోయిన విమర్శలు
ఆప్ఘనిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సొంత అభిమానులు, సెలబ్రిటీలు, మాజీ క్రికెటర్లు ఇలా ప్రతి ఒక్కరూ పాక్ జట్టు ఆటను ఏకిపారేస్తున్నారు. ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచుల్లో పాకిస్థాన్ మూడింటిలో ఓటమి పాలైంది. ముఖ్యంగా భారత్, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్థాన్ చేతిలో మట్టికరిచింది. నేడు దక్షిణాఫ్రికాతో పోరాడుతోంది. ఈ మ్యాచ్ లోనూ ఓడితే పాకిస్థాన్ కు సెమీస్ అవకాశాలు కష్టంగా మారతాయి. అప్పుడు బాబర్ అజామ్ మరోసారి విమర్శకులకు లక్ష్యంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.
బాబర్ అజామ్ పై వస్తున్న విమర్శలకు పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీమ్ స్పందించాడు. పాకిస్థాన్ ప్రజల మనసు గెలుచుకునే అవకాశం బాబర్ కు ఇప్పటికీ ఉన్నట్టు చెప్పాడు. ప్రపంచకప్ ను పాకిస్థాన్ గెలుచుకుంటే అప్పుడు యావత్ దేశం బాబర్ అజామ్ ను క్షమిస్తుందన్నాడు. ఆప్ఘనిస్థాన్ పై ఓటమితో తాము తీవ్ర నిరాశ చెందినట్టు బాబర్ అజామ్ లోగడ ప్రకటించడం తెలిసిందే. ఈ ఓటమి తదుపరి మ్యాచ్ ల విషయంలో తమ ఆటగాళ్లకు ఓ సందేశంగా పేర్కొన్నాడు. బాబర్ ను కెప్టెన్ గా పీకి పారేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వినిపిస్తుండడం తెలిసిందే. కనుక నేటి మ్యాచ్ పాకిస్థాన్ కు కీలకంగా మారింది. దక్షిణాఫ్రికాపై గెలిస్తేనే పాక్ జట్టుపై విమర్శలు కాస్తంత తగ్గుతాయి.