‘వన్డే ప్రపంచకప్’ జట్టు కెప్టెన్‌గా నెదర్లాండ్ స్టార్.. పాక్ స్కిప్పర్ బాబర్ ఆజంను పక్కన పెట్టేసిన కివీస్ దిగ్గజం

  • వరుసగా మూడు పరాజయాలతో సెమీస్ అవకాశాలను సంక్షిష్టం చేసుకున్న పాక్
  • ప్రపంచకప్ వన్డే జట్టుకు తానైతే నెదర్లాండ్స్ కెప్టెన్‌ స్కాట్‌నే ఎంచుకుంటానన్న షేన్‌బాండ్
  • నేడు బలమైన సౌతాఫ్రికాతో తలపడనున్న పాక్
  • బాబర్‌కు ఈ మ్యాచ్ అగ్నిపరీక్షే
తొలుత రెండు మ్యాచుల్లో గెలిచి ఆపై వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. చెత్త ఆటతీరుతో సెమీస్ ఆశలు సంక్లిష్టం చేసుకున్న పాకిస్థాన్ సొంత మాజీల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా కెప్టెన్ బాబర్ ఆజంను పాక్ క్రికెట్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. తాజాగా, ఈ జాబితాలోకి న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్‌బాండ్ చేరాడు.

‘ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో’తో ఇంటరాక్షన్ సందర్భంగా..  బాబర్ ఆజం, నెదర్లాండ్స్ స్కిప్పర్ స్కాట్ ఎడ్వార్డ్స్‌లలో ‘వన్డే ప్రపంచకప్’ కెప్టెన్‌గా ఎవరిని ఎంచుకుంటారన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తానైతే స్కాట్‌నే ఎంచుకుంటానంటూ బాబర్‌ను పక్కన పెట్టేశాడు. 

పాకిస్థాన్ నేడు చెన్నైలో బలమైన సౌతాఫ్రికాను ఎదుర్కోబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పాక్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే, ఈ ప్రపంచకప్‌లో అత్యంత బలంగా కనిపిస్తున్న సఫారీలను పాక్ ఏమేరకు ఎదుర్కోగలదనేదే అసలు ప్రశ్న. అయితే, పాక్‌కు ఇలాంటివి కొత్తకాదు. తనదైన రోజున ఆ జట్టు ఎంతటి బలైమన ప్రత్యర్థినైనా మట్టికరిపించిన సందర్భాలు అనేకం. కాగా, ఈ మ్యాచ్ బాబర్‌కు అగ్నిపరీక్షే అని చెప్పాలి. ఇందులోనూ ఓడితే అతడి కెప్టెన్సీ ఊడిపోవచ్చు. పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఈ విషయంలో హింట్ ఇచ్చింది కూడా.


More Telugu News